![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -300 లో.....కార్తీక్ రెస్టారెంట్ దగ్గరికి జ్యోత్స్న రెస్టారెంట్ ఎంప్లాయిస్ వస్తారు. మేం ఇక్కడ పని చెయ్యాలని అనుకుంటున్నామని అంటారు. మిమ్మల్ని తీసుకోవాలని నాకు ఉంది కానీ అలా చెయ్యకూడదు ఇన్ని రోజులు మీకు అన్నం పెట్టిన రెస్టారెంట్ అని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న కోపంగా కార్తీక్ దగ్గరికి వస్తుంది. ఎందుకు మా ఎంప్లాయిస్ ని మోసం చేసి నీ వైపు కీ తిప్పుకుంటున్నావని జ్యోత్స్న అంటుంది. మోసం అంటే తెలుసా అంటూ కోపంగా మాట్లాడతాడు కార్తీక్.
ఏం అన్యాయం చేసారని నా కూతురు, భార్య ని చంపాలనుకుంటున్నావు. ఇంకొకసారి వాళ్ల జోలికి రాకు అని జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమని జ్యోత్స్నకి కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న రెస్టారెంట్ ఎంప్లాయిస్ తో దీప మాట్లాడుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పెద్దాయనతో మాట్లాడి సాల్వ్ చేసుకోండి అని దీప వాళ్లకి నచ్చజెప్పుతుంది. అదంతా జ్యోత్స్నకి కార్తీక్ చూపిస్తాడు. వాళ్ళు నేను చెప్పిన వినడం లేదని దీపతో చెప్పిస్తున్న అని కార్తీక్ అంటాడు. ఇలా ఆవేశం గా ఉండడం కాదు ఎంప్లాయిస్ కష్టాలు ఏంటో కనుక్కోమని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. ఎప్పటికి నాపై గెలువలేవని జ్యోత్స్న చెప్పి వెళ్తుంది. మరొకవైపు జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. ఎందుకు ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి.. వర్కర్స్ కీ ఎందుకు నమ్మకం పోతుంది.. నువ్వు ఎప్పుడు ఆ కార్తీక్ రెస్టారెంట్ చుట్టూ తిరుగుతుంటే ఇలానే ఉంటుంది.. ఇలా ఇంకొకసారి జరగకూడదంటూ జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. లాయర్ తో వీలునామా రాయమని చెప్పానని శివన్నారాయణ అంటాడు. నిజంగానే విడాకులా అని పారిజాతం భయపడుతుంది. ఆస్తుల వీలునామా రాయించానని శివన్నారాయణ అనగానే.. ఏం రాసారని పారిజాతం అడుగుతుంది. లాయర్ వస్తాడు కదా అప్పుడే తెలుస్తుందని శివన్నారాయణ అంటాడు.
శ్రీధర్ దగ్గరికి పారిజాతం వెళ్లి విషయం చెప్పి లాయర్ నీ ఫ్రెండ్ కదా ఎవరికి ఎంత రాశాడో కనుక్కోమని చెప్పగానే వాడు మావయ్య ద్వారానే ఫ్రెండ్ అయ్యాడు. మావయ్యకి తెలుస్తుందని అడగనని శ్రీధర్ అంటాడు. దాంతో పారిజాతం డిస్సపాయింట్ గా వెళ్తుంది. నా మొదటి భార్యకి ఆస్తి విషయంలో అన్యాయం జరిగితే ఒప్పుకోనని కావేరితో శ్రీధర్ అంటాడు. మరొకవైపు వీలునామాలో ఏం రాసారోనని శివన్నారాయణ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. కానీ పారిజాతం ప్లాన్ అర్ధమై అతను చెప్పడు. ఆ తర్వాత కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |